పక్షి ప్రేమికులకు ముఖ్య గమనిక. ఏపీలో ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ నెలలోనే ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. జనవరి 18 నుంచి 20 వరకూ మూడు రోజుల పాటు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. అయితే ఈ సారి టీడీపీ కూటమి ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్‌ను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. దీంతో అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఐదు చోట్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.