Lavu Sri Krishna Devarayalu Parliament Speech: దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు వచ్చింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ సీట్లు పెరుగుతున్నాయని.. ఉత్తరాదిలో మాత్రం సీట్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఉత్తరాదిలో 155 సీట్లు పెరుగుతుంటే.. దక్షిణాదిలో కేవలం 35 సీట్లు మాత్రమే పెరుగుతున్నాయన్నారు. ఇది సరికాదని.. దక్షిణాది రాష్ట్రాలకు కూడా న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.