నిరుద్యోగులు, గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా ఔత్సాహికులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) కింద తేనెటీగల పెంపకం చేపట్టే వారికి రాయితీలు ఇస్తున్నారు. తేనెటీగల పెంపకంపై ధ్రువీకరణ పత్రం పొందిన వారికి.. తేనెటీగల పెట్టెలు, యంత్రాలపై 40% రాయితీ లభిస్తోంది. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు.