Andhra Pradesh Waqf Board Appointed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ప్రభుత్వం పునర్నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం చేపట్టినట్టు అందులో పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యుల నుంచి ఎండీ రుహుల్లా (ఎమ్మెల్సీ), షేక్ ఖాజా(ముతవల్లీ)లను నియమించింది. మహ్మద్ నజీర్( గుంటూరు ఎమ్మెల్యే), సయ్యద్ దావుద్ బాషా బాక్వీ, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముకర్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇస్మాయేల్ బేగ్‌లను వక్ఫ్‌బోర్డు సభ్యులుగా నామినేట్ చేసింది.