AP New Year Liquor Sales Rs 200 Crores: ఏపీలో ముందుబాబులు 2025కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. మద్యం ప్రియులు 31వ తేదీ ఒక్కరోజే భారీగా మద్యం తాగేశారు. రాష్ట్రంలో 2024 డిసెంబర్ 22వ తేదీ నుంచి 31 వరకు పది రోజుల్లో భారీగా మద్యం సరఫరా అయ్యింది. రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్ మూడు సెలవు రోజులు మినహా మిగిలిన 7 రోజులు డిపోల నుంచి కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. డిసెంబర్ 31న దాదాపు రూ.200 కోట్ల మద్యం తాగేశారు.