ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ఏపీలో పెట్టుబడులు పెడుతోంది. విశాఖపట్నంలోని ఎండాడ వద్ద పతంజలి గ్రూప్ వెల్‌నెస్ హబ్ ఏర్పాటు చేయనుంది. రూ.118 కోట్లతో ఈ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్ ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. అలాగే 2750 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుందని అధికారులు చెప్తున్నారు. ఎండాడలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో పతంజలి వెల్ నెస్ హబ్ ఏర్పాటు చేయనున్నారు.