Ap Govt 891 Employees Transfer To Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు సంబంధించి ముఖ్యమైన అడుగు పడింది. ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు వెళ్లడానికి ఆప్షన్ ఎంచుకున్న 891మంది ఉద్యోగుల సమాచారాన్ని పంపారు. ఈ మేరకు తదుపరి చర్యల నిమిత్తం దీనిని పరిశీలించి అభిప్రాయాన్ని, అంగీకారాన్ని తెలియజేయాలని తెలంగాణ సీఎస్‌ను ఏపీ సీఎస్ లేఖలో కోరారు.