Ntr Bharosa Pension Scheme Mobile Information: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీకి సంబంధించి కీలక మార్పులు చేసింది. పింఛను తీసుకోని లబ్ధిదారులకు ప్రతి నెలా సమాచారం అందించేందుకు సెర్ప్ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి ఎప్పటికప్పుడు తెలియజేయనున్నారు. ఒకటో తేదీన పింఛన్ తీసుకోని వారు రెండో తేదీన సచివాలయంలో తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. గతంలో పింఛన్ తీసుకోని వారికి మరుసటి నెలలో కలిపి ఇచ్చే నిబంధనను పునరుద్ధరించారు.