Ntr Bharosa Pension Transfer Option Opened: ఏపీ ప్రభుత్వం పింఛన్ బదిలీకి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను బదిలీ చేయించుకోవాలనుకునే లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పింఛను వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ను కూడా ప్రభుత్వం ఇచ్చింది. పెన్షన్ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేర్లను అందించాలి.. ఆధార్ జెరాక్స్ కూడా ఇవ్వాలి. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.