Ntr Bharosa Pension Distribution Time Changed: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పింఛన్ పంపిణీ సమయంలో మొబైల్ యాప్‌లో ఉన్న ఆడియో సందేశాన్ని పింఛను దారులకు వినిపిస్తారు. పింఛను పథకాన్ని ప్రభుత్వ ప్రచార విధానంలోకి చేర్చారు.. పంపిణీలో నాణ్యత, పింఛను దారుల్లో సంతృప్తి పెంచేందుకు యాప్్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. అలాగే పింఛనుదారుల ఇంటి నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛను పంపిణీ చేసినప్పుడు కారణాలను అక్కడ నమోదు చేసి పింఛను పంపిణీ చేయాలి.