ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఏపీలో ఉనికి కోసం పోరాడుతోంది. ఈ క్రమలో పార్టీ బలోపేతం కోసం నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసనగా జనవరి 28, 29, 30 తేదీల్లో పార్టీ సీనియర్ నేత రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో 'గాంధీ సందేశయాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు పాక్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పాదయాత్రలో పాల్గొనాలని సీనియర్ నేతలు పిలుపునిచ్చారు.