Chandrababu On New Houses Distribution Again: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను సంతృప్తికర రీతిలో అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అమరావతిలో ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేశారు. మరోసారి ఈ ఏడాది సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని గృహనిర్మాణ శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. అంతేకాదు టిడ్కో ఇళ్లు కాకుండా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి అందించాలి అన్నారు.