గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇప్పుడు ఏపీలో రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ చూడ్డానికి వచ్చిన ఇద్దరు అభిమానులు ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవటంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీనికి వైసీపీ కౌంటర్లు ఇస్తుండటంతో.. వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమవుతోంది.