Andhra Pradesh Panchayat Raj Department Employees Promotions: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖలో ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కృష్ణతేజ ప్రక్రియను ప్రారంభించే పనిలో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనల్ని స్వీకరిస్తున్నారు. అలాగే డీపీసికి సంబంధించి కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.