AP Rural Development Employees Promotions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు - రాష్ట్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో)ను నేరుగా నియమించే విధానం రద్దుకు ఓకే చెప్పారు. అంతకంటే కిందిస్థాయి (ఫీడర్ క్యాడర్) ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, ఎంపీడీఓ ఖాళీలు భర్తీ చేయనున్నారు. మండలాల్లో ప్రస్తుత EO PR&RD లను ఇకపై డిప్యూటీ ఎంపీడీఓలుగా పరిగణిస్తారు. దీనికి సంబంధించిన సర్వీస్ నిబంధనలను సవరిస్తూ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. MPDO , డివిజనల్ పంచాయతీ అధికారులను (DLPO) ఒకే క్యాడర్‌గా నిర్ధారించారు.