ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల మార్కెట్ విలువను రెండోసారి పెంచుతోంది. మరోవైపు ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో భూములు కొనేవారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతుంటే.. అమ్మేవారు మాత్రం ఆగితే కాస్త కలిసొస్తుందని భావిస్తున్నారు.