AP New Liquor Policy Govt Cabinet Sub Committee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. నూతన మద్యం పాలసీకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కెబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవిలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని కెబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేసి.. వివిధ వర్గాల నుంచి మంత్రి వర్గ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరిస్తారు. అయితే తెలంగాణ తరహా విధానం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.