Andhra Pradesh Liquor Shops Owners Margin: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని గీత కార్మిక కులాలకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించేందుకు వారంరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గీత కార్మిక కులాలకు కేటాయించే మద్యం షాపులకు సంబంధించి అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు చంద్రబాబు ఆమోదం తెలియజేశారు. అలాగే మద్యం షాపులు దక్కించుకున్నవారికి 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే తక్కువ ధరకే మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్లేదన్నారు.