Andhra Pradesh New Liquor Shops No Permit Rooms: ఏపీలో మద్యం షాపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది.. కొత్త మద్యం షాపులు ప్రారంభంకాగా.. ఆ పక్కన పర్మిట్ రూమ్‌ల సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది. కొత్త పాలసీలో పర్మిట్ రూమ్ అంశాన్ని చేర్చలేదు. దీంతో పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడింది అంటున్నారు.