ఏపీలో మద్యం షాపుల నడుపుతున్నవారికి షాక్.. లైసెన్సులు రద్దు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

5 months ago 10
Chandrababu On Liquor Shops License Cancelled: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యంతో పాటూ ఇసుక లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని సీఎంకు వివరించిన అధికారులు.. మద్యం ధరల విషయంలో అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మార్పీ ధరలకు మించి మద్యం విక్రయిస్తే ఉపేక్షించొద్దని.. ఎమ్మార్పీ ధరకు మించి మద్యం విక్రయించినట్లు రుజువైతే మొదటిసారి రూ.5 లక్షల జరిమానా.. రెండోసారి తప్పు జరిగితే షాపు లైసెన్స్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్టుషాపులను అనుమతించొద్దని.. లిక్కర్ షాపు యజమానులు బెల్టుషాపులను ప్రోత్సహిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయం.. ఫిర్యాదుల కోసం టోల్‍ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి.
Read Entire Article