Andhra Pradesh Liquor Policy Renewal Proposal: ఏపీలో మద్యం పాలసీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పాలసీ ముగుస్తుండగా.. ప్రభుత్వం కొత్త పాలసీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న పాలసీనే రెన్యువల్ చేయాలా?.. కొత్త పాలసీ తీసుకురావాలా అనే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. పాలసీని రెన్యువల్ చేసే అంశంపైనా ప్రధానంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.