AP Liquor Shop Owners Excise Commissioner: ఏపీలో మద్యం షాపుల్ని దక్కించుకున్నవారు తమకు నష్టాలు వస్తున్నాయంటున్నారు. కొత్త మద్యం పాలసీలో 20శాతం మార్జిన్ ఇస్తామని ప్రకటించారని.. కానీ ఇప్పుడు తమకు 10శాతం మాత్రమే వస్తుందంటున్నారు. ఇలాగైతే తమకు నష్టాలు తప్పవంటున్నారు.. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే వెంటనే స్పందించిన ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా దీనిపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఈమేరకు మద్యం షాపుల యజమానులకు కాస్త ఊరట దక్కింది.