ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మినారాయణ.. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఇటీవల ఢిల్లీ పర్యటనలో కోరినట్లు సమాచారం. ఇందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కేంద్ర మంత్రి.. ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం 1200 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది.