Vijayawada Machilipatnam National Highway 65: రాష్ట్ర రాజధాని అమరావతికి మచిలీపట్నం పోర్టును అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా పోర్టుకు రహదారి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఈ అనుసంధానం సాధ్యమవుతుంది. పోర్టు పనులు పూర్తయ్యే సమయానికి రహదారి అందుబాటులోకి రానుంది.