Chinna Avutapalli To Gollapudi Bypass Will Ready By March 2026: విజయవాడవాసులకు, విశాఖపట్నం వైపు వెళ్లేవాసులకు పండగే.. త్వరలోనే మరో బైపాస్ రోడ్డు అందుబాటులోకి రాబోతోంది. చినఆవుటపల్లి-గొల్లపూడి మధ్య బైపాస్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి పనులు పూర్తి చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే గొల్లపూడి నుంచి చినకాకాని బైపాస్ కూడా మార్చి 31 నాటికి పూర్తవుతుంది అంటున్నారు.