ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగుతోంది. చెన్నై - బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పలమనేరు అడవి గుండా ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏనుగుల సంచారానికి ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా 12 చోట్ల అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి.. జూన్ 2026 నాటికి అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.