ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువ కొనసాగుతోంది. తాజాగా తైవాన్‌కు చెందిన కంపెనీ ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే తైవాన్ ప్రతినిధుల బృందం.. తాజాగా సీఎం చంద్రబాబును కలిసింది. ఏపీలో రూ.400 కోట్లతో ఒక పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలిపింది. ఇక తైవాన్ కంపెనీలు పెట్టుబడి పెడితే.. సహకరించేందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని వారితో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.