ఏపీలో మరో రెండు కొత్త ఎయిర్‍పోర్టుల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతి, శ్రీకాకుళం జిల్లాలలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా ఈ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకై ప్రీఫీజబులిటీ స్టడీ, టెక్నో ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్టు తయారీ కోసం కన్సల్టెన్సీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఆన్‌లైన్‍లో టెండర్లను ఆహ్వానిస్తోంది.