Apdc Hiring 24 Social Media Assistant Posts: ఏపీ ప్రభుత్వం మంత్రుల పేషీల్లోకి కొత్తగా ఇద్దర్ని తీసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది.. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పోరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, తగిన అనుభవం ఉన్నవారు వెంటనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీరిని ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పద్ధతిలో నియమించుకుంటారు.. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా వీరిని తీసుకుంటారు.