బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే రెండ్రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. అంతేకాకుండా మత్స్యకారులు అస్సలే వేటకు వెళ్లకూడదని వివరించింది. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందును ప్రజలు వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండడం మంచిదని చెప్పింది. ముఖ్యంగా రైతులు పంట పొలాల వద్దకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది.