ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన తేవాలని వైసీపీ కుట్రచేస్తోందని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి కూల్చేయాలనే కుట్తతోనే పడవలను వదిలారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రజలు కష్టా్ల్లో ఉంటే.. వైఎస్ జగన్ మాత్రం రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మరోవైపు నందిగం సురేష్‌ను వైఎస్ జగన్ పరామర్శించడంపైనా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సెటైర్లు పేల్చారు.