Online slot booking for property registration in AP: ఏపీలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నూతన విధానం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్లు మరింత సులభతరంగా ఉండటంతో పాటుగా వేగంగా, పారదర్శకంగా ఉండేలా ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు నూతన విధానం అమల్లోకి తెచ్చింది. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని.. ఆ సమయానికి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి తెచ్చారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు.