Kurnool Guntur National Highway 340C: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమను అమరావతితో కలిపేందుకు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిని వేగంగా నిర్మిస్తోంది. రూ.1,179 కోట్లతో 66 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల రోడ్డుకు సంబంధించిన పనుల్లో నాణ్యత లోపించిందని విమర్శలు వస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వేసిన మట్టి కట్టలు వర్షానికి కొట్టుకుపోవడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.