AP Pet Ct Scan Free Under Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకం కింద పెట్ సీటీ స్కాన్ పరీక్షలను ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో 18 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పెట్ సీటీ స్కాన్ పరికరం ఏర్పాటు కానుంది. ఇది అందుబాటులోకి వస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని, త్వరలోనే రోగులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. బయట ఆస్పత్రుల్లో ఈ పరీక్షకు వేలల్లో ఖర్చవుతుంది.