ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. వీటి వల్ల 85 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నట్లు తెలిపింది. మూడు మెగా సిటీలు, 15 పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల సదస్సు ముందే శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు. కాగా, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.