రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈగల్ ఫోర్స్ ఏర్పాటు కోసం నిధులు కూడా కేటాయించారు. అదనపు డీజీ లేదా ఐజీ స్థాయి ఆఫీసర్ నేతృత్వంలో ఈగల్ ఫోర్స్ పనిచేస్తుంది. రాజధాని అమరావతిలో ఈగల్ ఫోర్స్ సెంట్రల్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ కూడా ప్రారంభించనున్నారు.