Kuppam Dagadarthi Airports Update: ఆంధ్రప్రదేశ్‌లో కుప్పం, దగదర్తిలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ విధానంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయాలకు హడ్కో నుంచి రుణం తీసుకోనున్నారు. కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుతో బెంగళూరు విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ఆ తర్వాత నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది.