Yerpedu Pudi New Railway Line Update: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, కొత్త రైలు మార్గాల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమన్వయం కోసమని టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పనులపై సమీక్ష చేశారు. ఈ మేరకు కలెక్టర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డబ్లింగ్, కొత్త లైన్ల నిర్మాణంపై కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మేరకు ఆయా లైన్లకు భూ సేకరణ జరుగుతోంది.