Andhra Pradesh Ration Distribution: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 2,774 చౌక దుకాణాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతి కిలోమీటరు పరిధిలో ఒక షాపు ఉండాలని భావిస్తున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు.. అలాగే త్వరలో కొత్త డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రేషన్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు.