AP Ration Card Holders Toor Dal: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. బియ్యం కార్డుదారులకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల అధికారులు సన్నాహాలు చేశారు. నేటి నుంచి కందిపప్పుతోపాటు బియ్యం, చక్కెర అందించనున్నారు. ఎన్నో నెలల తర్వాత కందిపప్పును రేషన్‌తో పాటుగా పంపిణీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.