Andhra Pradesh Ration Distribution: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు అందించింది. రేషన్ వస్తువుల్లో లోటుపాట్లను సరిచేసి మళ్లీ వాటిని బియ్యంతో పాటుగా అందించబోతోంది. ఈమేరకు సెప్టెంబర్ నెల నుంచి కొత్త ప్యాకింగ్‌తో వచ్చిన పంచదారను రేషన్‌లో యథావిధిగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వంలో నిలిపేసిన మిగతా సరకులను కూడా పేదలకు దశలవారీగా రేషన్‌లో అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి మిగిలిన సరుకుల్ని కూడా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. రేషన్‌కు సంబంధించిన వివరాలు ఇలాా ఉన్నాయి.