AP Ration Card Holders Sugar: ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది.. సెప్టెంబర్ నుంచి బియ్యంతో పాటుగా మరికొన్ని సరుకులు పంపిణీకి సిద్దమైంది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటుగా చక్కెర కూడా ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి చక్కెరతో పాటుగా కందిపప్పు పంపిణీ చేయాలని భావించారు.. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి చక్కెర వరకు పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.