Ap Govt Release Pending Paddy Procurement Dues: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూపులకు నేడు ఎండ్ కార్డు పడనుంది.. నేడు అకౌంట్‌లలోకి డబ్బులు జమ చేయనున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ డబ్బులు విడుదల చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబ్బుల్ని జమ చేస్తోంది. తాజాగా 35,374 మందికి రూ.674.47 కోట్ల బకాయిలను నేడు క్లియర్ చేస్తోంది.