Andhra Pradesh Cabinet Farmers Loan Reschedule: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయానికి మంత్రిర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 30 తర్వాత వరద ముంపునకు గురైన విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో నిప్రాంతాల రైతులకు రుణాల రీ-షెడ్యూలుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రూ.50 వేలలోపు మంజూరు చేసిన రుణాలపై స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీల మినహాయింపు ఇచ్చారు.