రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ధాన్యం రైతుల బకాయిలను త్వరలో చెల్లించనున్నట్లు మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు ప్రకటించారు. ఎన్‌సీడీసీ నుంచి రూ.1,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని, మూడు రోజుల్లో ఆ మొత్తం మార్క్‌ఫెడ్‌కు బదిలీ అవుతుందని ఆయన తెలిపారు. మరోవైపు, పేద రైతుల పొలాల్లో ఉపాధి నిధులతో లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.