Andhra Pradesh Farmers E Crop: ఖరీఫ్-2024లో భాగంగా ఈ-పంట నమోదులో ఈనెల 15 నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అలాగే రైతుల బీమాకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ పంటలో నమోదైతేనే బీమా వర్తిస్తుందని తెలిపారు. రైతు వాటాను ప్రభుత్వం చెల్లిస్తుందని.. కానీ రబీనుంచి రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.