Andhra Pradesh Pashu Bima Scheme With 85 Percent Subsidy: ఏపీలో పశు బీమా పథకానికి సంబంధించి గతంలో ఉన్న 80శాతం బీమా ప్రీమియం రాయితీని 85శాతానికి పెంచారు. గత రెండేళ్లలో 60వేల పశువులకు బీమా సౌకర్యం కల్పించారు. పశు నష్టపరిహారం పథకం కింద పెండింగ్ బకాయిలు రూ.110 కోట్ల బకాయిలను పశుపోషకులకు చెల్లించారు. వరదలు, తుఫాన్ల వంటి విపత్తుల్లో పశువులు చనిపోతే రూ.37,500 ఉన్న పరిహారాన్ని రూ.50వేలకు పెంచారు.