ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు.. కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్నదాతలకు డబ్బుల జమలో ఆలస్యం చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లాగా.. నెలల తరబడి డబ్బు చెల్లింపులు ఉండకూడదన్నారు.