Bapatla Two Amrit Bharat Express Trains Halt: ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ మేరకు బాపట్ల, చీరాల స్టేషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. తిరువనంతపురం-చర్లపల్లి, రాధికాపూర్-బెంగళూరు మార్గాల్లో నడిచే ఈ రైళ్లు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా మారాయి. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ వెళ్లేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. త్వరలోనే వందేభారత్ రైలు కూడా బాపట్ల, చీరాలల్లో ఆగనుందని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు.