Andhra Pradesh Govt Asks Centre Rs 6880 Crore: ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా రూ.6,882 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదికను పంపింది. రోడ్లు భవనాల శాఖకు రూ.2,165 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. జలవనరుల శాఖకు 1,569 కోట్లు.. పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు 1,160 కోట్లు.. విద్యుత్ శాఖకు 481 కోట్లు, వ్యవసాయ శాఖకు 301 కోట్లు, మత్స్య శాఖకు 158 కోట్లు ఇలా శాఖలవారీగా నష్టాన్ని ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ అనంతరం నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.